దుండిగల్, ఫిబ్రవరి 6: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం సర్కిల్, సూరారం లోని శ్రీ కట్ట మైసమ్మ, రేణుక ఎల్లమ్మ అమ్మవార్ల జాతరను పురస్కరించుకొని ఈనెల 9, 10 తేదీలలో ట్రాఫిక్ దారి మళ్ళిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. జాతర ఈనెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో 9 ,10 తేదీలలో ప్రధాన జాతర జరగనున్న దృష్ట్యా సూరారం చౌరస్తా నుంచి మన బహదూర్ పల్లి వైపు వెళ్లే లైట్ వెహికిల్ వాహనాలను, అదేవిధంగా బహదూర్ పల్లి చౌరస్తా నుంచి సూరారం వైపు వచ్చే లైట్ వెహికల్ వాహనాలను ఒకే వైపు నుంచి అనుమతిస్తున్నట్లు తెలిపారు ఆలయం ముందు నుంచి వెళ్తున్న ఒకవైపు దారిని రెండు రోజులపాటు మూసివేస్తామన్నారు. అదేవిధంగా గండి మైసమ్మ చౌరస్తా వైపు నుంచి బాలానగర్ వైపు వచ్చే భారీ వాహనాలను బహదూర్ పల్లి చౌరస్తా నుంచి లెఫ్ట్ తీసుకొని దూలపల్లి చౌరస్తా నుంచి రైట్ తీసుకుని జేఈఈటిఎల్ వైపు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. అదేవిధంగా బాలానగర్ వైపు నుంచి గండిమైసమ్మ చౌరస్తా వైపు వెళ్లే వాహనాలు జీడిమెట్లలోని జేఈటిఎల్ మీదుగా దూలపల్లి చౌరస్తాకు చేరుకొని అక్కడినుండి ఎడమవైపుకు మళ్ళీ బహుదూర్ పల్లి చౌరస్తా మీదుగా గండిమైసమ్మ చౌరస్తాకు వెళ్లాల్సి ఉంటుందని సూచించారు. వాహనదారులు ఈ రెండు రోజులపాటు తమతో సహకరించాలన్నారు