ఘట్ కేసర్, ఏప్రిల్ 15: హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి డిమాండ్‌కు తరలించిన సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ పరశురాం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఘట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్‌లోని ఓ కూలర్ కంపెనీలో పని చేస్తున్న రియాజుద్దీన్ తో గత నెలలో అదే కంపెనీలో పని చేస్తున్న తాబరేజ్, ఇక్లాక్, ప్రకాష్ రాజ్‌ల మధ్య పని విషయంలో గొడవ జరిగింది.
అది దృష్టిలో పెట్టుకున్న తాబరేజ్, ఇక్లాక్, ప్రకాష్ రాజ్ ఈ నెల 13న రాత్రి 10.30 గంటల సమయంలో రియాజుద్దీన్ వద్దకు వెళ్లి ఇనుప రాడ్‌తో దాడి చేశారు. దింతో రియాజుద్దీన్‌కు తీవ్ర గాయాలు కావటంతో పాటు కాలర్ బోన్ విరిగింది. రియాజుద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.