మేడ్చల్ మల్కాజిరిగి : మున్సిపల్ ఎన్నికల(Muncipal elections) కౌంటింగ్ కొనసాగుతున్నది. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ గట్టి పోటీనిస్తున్నది. కాగా, అలియాబాద్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్వతంత్ర అభ్యర్థి వెంకటేశ్ కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు అడ్డుకున్నారు.
గమనించిన పోలీసులు వెంకటేశ్‌ను కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో తోపులాట చోటుచోసుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఉత్రిక్తంగా మారాయి.