రామంతాపూర్,జూన్ 19 : తెలంగాణ టూర్స్ ట్రావెల్స్బస్ ఓనర్స్ అసొసియోషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కె. గోపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా పి.మల్లేశ్, ప్రధాన కార్యదర్శిగా ఇల్లిటం నర్సింహరెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా కె. సోమయ్య, ఎస్. వెంకటయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఏ.బాల్‌రెడ్డి, జి.అనిల్‌కుమార్, వి.శోభన్, ఎండీ షరీఫ్, హెచ్.రమణారెడ్డి, ఎం.సంతోష్‌రెడ్డిని ఎన్నుకున్నారు.
అలాగే కోశాధికారులగా ఎం కొండల్‌రెడ్డి, కె. హరీశ్, సలహాదారులుగా అశ్వినీరెడ్డి, రాంమోహన్‌గౌడ్, ముకుందరెడ్డి, జి. రాములు, మరి కొంత మందిని కార్యవర్గ సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారిని స్థానికులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ టూర్స్ ట్రావెల్స్ బస్ ఓనర్స్ అసొసియోషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.