Drinking Water | బాలానగర్, మార్చి 17 : ఫతేనగర్ డివిజన్లో తాగునీటి సమస్యలు రాకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జలమండలి అధికారులను ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ కోరారు. ఇవాళ జలమండలి జనరల్ మేనేజర్ ప్రభాకర్‌ను కలిసి తాగునీటి సరఫరాపై చర్చించారు.
ఈ సందర్భంగా సతీష్ గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సరఫరా చేసినట్లుగానే ప్రస్తుత వేసవి కాలంలో తాగునీటిని సరఫరా చేయాలని సూచించారు. తాగునీటి సరఫరాలో ఒత్తిడికి తావు లేకుండా యధావిధిగా నీటి సరఫరా చేయాలని కోరారు. స్పందించిన జలమండల అధికారులు ఎలాంటి లోటు లేకుండా నీటి సరఫరా చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భిక్షపతి, సురేంద్ర నాయుడు. కిరణ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Read Also :
HYDRAA | బండ్లగూడలో హైడ్రా కూల్చివేతలు
ASP Chittaranjan | విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం తథ్యం : ఏఎస్పీ చిత్తరంజన్
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు