Gurukul School | ఘట్ కేసర్, మార్చి 29 : శిథిలావస్థకు చేరుకున్న గురుకుల్ విద్యాలయాన్ని పరిరక్షించాలనే డిమాండ్‌తో మాజీ సర్పంచ్, గురుకుల్ పూర్వ విద్యార్థి అబ్బసాని యాదగిరి యాదవ్ చేపట్టిన సేవ్ గురుకుల్ ఉత్తరాల ఉద్యమంలో భాగంగా పూర్వ విద్యార్థి కంది ప్రేమ్ కుమార్ ఉత్తరాలను స్పీడ్ పోస్ట్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు పంపించారు.
గురుకుల్ విద్యాలయానికి పూర్వ వైభవం కల్పించేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కొత్త కొండ వెంకటేష్, గడ్డం వెంకటేష్ యాదవ్, ఇమ్ము, మానుక కుమార్, చిత్తరంజన్, తిమోతి తదితరులు పాల్గొన్నారు.
Kathmandu | నేపాల్‌లో హింస.. 100 మంది అరెస్ట్
Chilli Farming | సస్యరక్షణ చర్యలతోనే మిర్చి అధిక దిగుబడులు: డాక్టర్ ఎం వెంకటేశ్వర్ రెడ్డి
Heart Health | ఈ ఆహారాలను తింటే మీకు గుండె పోటు అసలు రాదు.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది..