జవహర్‌నగర్ : అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం అభినందనీయమని, జవహర్‌నగర్ ప్రగతికి నిరంతరం కృషి చేస్తున్నామని మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. జవహర్‌నగర్ కార్పొరేషన్ 5వ డివిజన్ జ్యోతిరావుపూలే కాలనీలో కాలనీవాసులు సొంత నిధులు, మాజీ డిప్యూటీ మేయర్ సహకారంతో శుక్రవారం రూ.10 లక్షలతో భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. కార్పొరేషన్‌ను మురుగురహిత నగరంలా తీర్చిద్ధిద్దుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగన్న బాల్‌రాజ్, శ్రీమన్నారాయణ, మాధవ్, చంద్రమౌళి, మహేశ్వరి, మల్లమ్మ, విజయ, సుధాకర్, రామకృష్ణ, రామ్మోహన్, శ్రీకాంత్, లక్ష్మి, కల్పన, మనెమ్మ, పవన్ తదితరులు పాల్గొన్నారు.