Ragidi laxma reddy | రామంతాపూర్, మే 25 : బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దశరథ్ సేవలు మరువలేనివని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జి రాగిడి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఇవాళ హబ్సిగూడ డివిజన్ వెంకట్ రెడ్డి నగర్లో నిర్వహించిన దశరథ్ దశదిన కర్మలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. దశరథ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని ఆయన హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సుధాకర్ చారి, ఈగ సంతోష్, మల్లేష్, హనుమంత్, శరత్, నాగరాజు, జగన్, అనిల్, ఈశ్వర్, వెంకటేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.