N vasantha | జవహర్నగర్, మే 28 : పరిశుభ్రత, ప్రజారోగ్యమే లక్ష్యమని, ప్రజలు ఇంటి చుట్టూ వర్షపు నీరు, చెత్తా చెదారం నిల్వ ఉంచకుండా జాగ్రత్తలు పాటించాలని కమిషనర్ ఎన్ వసంత సూచించారు. జవహర్నగర్ కార్పొరేషన్లోని 10వ డివిజన్లో డెంగ్యూ కేసు నమోదవ్వగా కమిషనర్ వసంత సిబ్బందితో కలిసి బుధవారం బాధితురాలి ఇంటికి వెళ్ళి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డెంగ్యూ నివారణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాలు, ఇళ్ల మధ్య పడి ఉన్న చెత్తను తొలగించడంతోపాటు ప్రతీ రోజు ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరిస్తూ కాలనీలను స్వచ్ఛ జవహర్నగర్గా తీర్చిదిద్దుతున్నామఅన్నారు. డెంగ్యూపై ప్రజలు ఆందోళన చెందవద్దని, నివారణతోనే అరికట్టవచ్చని, ప్రజలు పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు.
బాధితురాలి ఇంటి చుట్టూ హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేశామని, దోమల నివారణకు సాయంత్రం ఫాగింగ్ చేస్తున్నామని, నిల్వ నీటిని తొలగించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ కృష్ణప్ప, ఎన్వీరాన్మెంట్ ఇంజినీర్ సందీప్, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
KTR | మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ నివేదిక బూటకమని తేలిపోయింది : కేటీఆర్
Bad Breath | నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలను పాటించండి..!
Jio Electric Scooter | మార్కెట్లో జియో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇవీ ఆ స్కూటర్ ప్రత్యేకతలు