World No Tobacco Day | చర్లపల్లి, మే 31 : మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కుషాయిగూడలోని జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ జడ్జి డి కిరణ్‌కుమార్ కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్స్‌తో పొగాకుకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ ధుమపానంకు దూరంగా ఉండాలని.. పొగాకు ఉత్పత్తులను తీసుకోవద్దన్నారు. పొగాకు తీసుకోవడంతో పలు రోగాలకు గురికావాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా కోర్టు సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్స్‌కు కోర్టుకు వచ్చే కక్షిదారులకు పొగాకుపై అవగాహన కల్పించాలని సూచించారు.
కోర్టు అవరణలో పొగాకు తీసుకున్నా, ధుమపానం చేసినా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియెషన్ ప్రతినిధులు, న్యాయవాదులు, పారా లీగల్ వాలీంటర్స్, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Fake Seeds | నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు : తొగుట సీఐ లతీఫ్
Ramayampet | లారీ – బైక్ ఢీ.. ఒకరికి తీవ్రగాయాలు
రామాయంపేటలో పాఠ్య పుస్తకాలు సిద్దం.. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే అందజేత