Missing | మేడ్చల్, మే 25 : తల్లీకొడుకులు అదృశ్యమైన సంఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన మన్నె సత్యనారాయణ భార్య మన్నె స్వప్న(26) శుక్రవారం ఎల్లంపేటలోని తన నివాసం నుంచి పని ఉందని కొడుకు(6)ను తీసుకొని బయల్దేరింది.
ఇలా ఇంటి నుంచి బయటికి వెళ్లిన స్వప్న తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.