దుండిగల్, ఫిబ్రవరి 18: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేదమంత్రాలతో ఎమ్మెల్సీని ఆశీర్వదించి, స్వామివారి దివ్య ప్రసాదాన్ని అందజేశారు.
కార్యక్రమంలో కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, కొలుకుల జగన్, మాజీ కార్పొరేటర్ సురేశ్ రెడ్డి, గాజుల రామారం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విజయారామిరెడ్డి, సీనియర్ నాయకులు జిన్నారం వెంకటేశ్ గౌడ్ ,మాజీ కౌన్సిల్ సాయి తదితరులు పాల్గొన్నారు
Shambirpur Krishna
దుండిగల్, ఫిబ్రవరి 18: నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు, దుండిగల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ శంబిపూర్ కృష్ణ అన్నారు. శంభీపూర్ లోని ఆయన కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజలు , సంక్షేమ సంఘాల నాయకులు,బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ తమ సమస్యలను తెలుపుతూ పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన కృష్ణ ప్రజా సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.