
రూ.3.7 కోట్ల చెక్కులు అందజేత.. ఎమ్మెల్యే మైనంపల్లి
గౌతంనగర్, అక్టోబర్ 2 : మంత్రి కేటీఆర్ చొరవతోనే మౌలాలి కమాన్ రోడ్డు విస్తరణలో భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. రూ.3కోట్ల 70లక్షల వరకు ఎమ్మెల్యే చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపుగా 17 సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న కమాన్ రోడ్డు వైండింగ్ సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే ఆయన పరిష్కరించారని తెలిపారు. రోడ్డు కటింగ్‌లో స్థలాలు కోల్పోయిన వారందరికీ మొదటి విడతలో దాదాపుగా రూ.5కోట్లు, రెండవ విడతలో రూ.3కోట్ల వరకు నష్టపరిహారం చెల్లించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ గజానంద్, కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు జగదీశ్‌గౌడ్, పిట్ల శ్రీనివాస్, జీఎన్వీ సతీశ్కమార్, అమీనొద్దీన్, భాగ్యనందరావు, డివిజన్ అధ్యక్షుడు సత్తయ్య, సాధికర్, ఇబ్రహీం, శ్రీనివాస్‌రెడ్డి, సంతోష్నాయు డు, సంతోష్‌గుప్తా, ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు.