మల్కాజ్గిరి, ఫిబ్రవరి 22 : ఆర్యూబీఆర్ఓబీ నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశించారు. శనివారం బోయిన్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో బల్దియా అధికారులతో ఆర్యూబీఆర్వోబీ నిర్మాణ పనుల గురించి సమీక్ష సమావేశం ఎమ్మెల్యే నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గౌతమ్ నగర్ రైల్వే క్రాసింగ్ వద్ద త్వరలోనే నిర్మించనున్న ఆర్యూబీ నిర్మాణం పనులు, ఆర్.కే పురం ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. మౌలాలి గుట్టపై నిర్మిస్తున్న ర్యాంప్ నిర్మాణ యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని అన్నారు. రూ. 245 కోట్లు మంజూరయ్యాయని, ఆర్కే పురంలో ఆర్ఓబి, ఆర్యూబీ నిర్మాణాలు ప్రారంభించాలని అన్నారు. గౌతమ్ నగర్ ఆర్.యు.బి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకొని ప్రారంభించాలని అన్నారు. మౌలాలి గుట్ట పై నిర్మిస్తున్న ర్యాంప్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు.