MLA MallaReddy | రాజకీయ నాయకుల్లో నా రూటే సెఫరేటు అని చెప్పేవాళ్లు కొంతమంది ఉంటారు. అలాంటి వారి జాబితాలో టాప్‌లో ఉంటారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఈయన స్టేజ్‌పైకి ఎక్కి స్పీచ్ ఇచ్చినా.. మైదానంలోకి దిగి గేమ్ ఆడినా నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతుంది. తాజాగా ఆయన విద్యార్థినులతో కలిసి కబడ్డీ ఆడి సందడి చేశారు.
మేడ్చల్ నియోజకవర్గం మూడు చింతలపల్లి పురపాలక పరిధి జగన్ గూడ గ్రామంలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ (TGMREIS) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రారంభించారు.
అనంతరం మల్లారెడ్డి స్వయంగా కబడ్డీ కోర్టులోకి దిగారు.. విద్యార్థినులతో కలిసి కబడ్డీ ఆడారు. మల్లారెడ్డి కూత పెడుతూ విద్యార్థినులతో కలిసి చాలా ఎనర్జీగా కబడ్డీ ఆడిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి
మేడ్చల్ నియోజకవర్గం ముడు చింతలపల్లి పురపాలక పరిధి జగన్ గూడ గ్రామంలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ (TGMREIS) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించి..… pic.twitter.com/9FxAd8hXUJ
— Telugu Scribe (@TeluguScribe) December 20, 2025