కుత్బుల్లాపూర్, సెప్టెంబర్5: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బస్తీలు, కాలనీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం ఆయన 128 చింతల్ డివిజన్లో రూ.358 కోట్లతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మొదటగా సాయినగర్‌లో రూ.14.55 లక్షలు, పట్వారీఎన్క్లేవ్లో రూ.15.25 లక్షలు, స్టార్ హోమ్స్‌లో రూ.16.9 లక్షలు, దుర్గయ్యనగర్‌లో రూ.9.95 లక్షలు, భగత్‌సింగ్‌నగర్ రోడ్డు నంబర్ 37నుంచి 55 వరకు రూ.74.8లక్షలు, రోడ్డునంబర్ 17 నుంచి36 వరకు రూ.66.2 లక్షలు, రోడ్డునంబర్ 37 నుంచి 55 వరకు రూ. 83.7లక్షలు, ఓల్డ్ చింతల్లో రూ.16.5 లక్షలు, చింతల్ నుంచి ఫిష్‌మార్కెట్ నాలా వరకు రూ.60.44 లక్షలతో చేపట్టనున్న సీసీ పైపులైన్ల నిర్మాణ పనులతో పాటు భూగర్భడ్రైనేజీ పనులకు కార్పొరేటర్ రషీదామహ్మద్ రఫీలతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నదని కొనియాడారు. భగత్‌సింగ్‌నగర్‌లో నిర్మిస్తున్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయని అన్నారు. కార్యక్రమంలో చింతల్ డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ రఫీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తుంగ లక్ష్మారెడ్డి, వార్డుసభ్యులు, కాలనీవాసులు, సంక్షే మ సంఘాల ప్రతినిధులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్5: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులపై బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి పలువురు నాయకులు, కార్యకర్తలు చేరు తున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివా రం 128 చింతల్ డివిజన్‌కు చెందిన బీజేపీ నాయకుడు ప్రేమ్కుమార్యాదవ్ మరో 50 మంది నాయకులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో చిం తల్ డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ రఫీ, నాయకులు బాల్‌రెడ్డి, వరద రాజులు, సామ్రాట్, హరికుమార్, సాయికిరణ్‌గౌడ్, అశోక్, మల్లేశ్, సాంబ, బాబురావు పాల్గొన్నారు.
దుండిగల్, సెప్టెంబర్ 5: నియోజకవర్గంలోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, 18వ డివిజన్, సాయిఅనురాగ్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసి న గౌతమబుద్ధుడి విగ్రహాన్ని ఎమ్మెల్యే వివేకానంద్, మేయర్ కొలన్ నీలా గోపాల్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏకాగ్రత, శాంతికి ప్రతిరూపం గౌతమ బుద్ధుడని, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విగ్రహ ఏర్పాటుకు కృషిచేసిన కార్పొరేటర్ కొలన్ వీరేందర్‌రెడ్డితోపాటు స్థానికులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో నిజాంపేట కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధన్రాజు, టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఆగం పాండు ముదిరాజు, కార్పొరేటర్లు చిట్ల దివాకర్, కాసాని సుధాకర్ ముదిరాజు, కాలనీ సంక్షేమసంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.