కుత్బుల్లాపూర్,సెప్టెంబర్4: స్వశక్తితో ముందుకు సాగినప్పుడే జీవితంలో గెలుపోటములు తెలుస్తాయన్నారు. ఆదే గుణపాఠం, జీవిత లక్ష్యాన్ని చేరుస్తుందనే దిశగా ఎస్ఎల్ఎన్ వెంచర్ నిర్వాహకులను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అభినందించారు. శనివారం కుత్బుల్లాపూర్ డివిజన్లోని పద్మానగర్ ఫేస్-2లో ఉన్న ఎస్ఎల్ఎన్ వెంచర్ కార్యాలయంలో జరిగిన సంస్థ రెండవ వార్షికోత్సవం వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్యఅతిధిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయస్సులో పట్టుదలతో రాణిస్తూ జీవితంలో అనుకున్న లక్ష్యాయాన్ని చేరేదిశగా పని చేస్తున్న ఎస్ఎల్ఎన్ వెంచర్ నిర్వాహకుల పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తూ, మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశించారు. అనంతరం సంస్థ నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువతో సత్కరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీశ్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్మయ్, డైరెక్టర్ జాలిగం రాకేశ్‌తో పాటు టీం సభ్యులు పాల్గొన్నారు.