జీడిమెట్ల, ఆగస్టు 28 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు అన్నారు. శనివారం చింతల్ డివిజన్, ఎన్ఎల్బీనగర్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయిన సందర్భంగా కాలనీవారికి సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. నియోజకవర్గం పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. కరోనా తగ్గుము ఖం పడుతున్నప్పటికీ ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీ ప్రశాంతి, చింతల్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మహమ్మద్ఫ్రీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజుయాదవ్, సూరారం డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, పీఎసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్‌రెడ్డి, డాక్టర్ శ్రీజ, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేపీ వెంకటేశ్‌గౌడ్, నాయకులు బస్వరాజ్, ప్రభాకర్‌గుప్తా, శేఖర్‌రావు, సుదర్శన్. రాజబ్రహ్మం, స్వర్ణలత, శ్వేత, జనార్దన్‌రెడ్డి, రాములుగౌడ్, రాచకొండ కుమార్, వాసుదేవ్, రఘు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.