గాజులరామారం, ఆగస్టు 25 : దైవ చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని మహదేవపురంలోని జైగురు రాఘవేంద్ర స్వామి మఠంలో 350వ ఆరాధన మహోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పూజలు చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఇంద్రసేనగుప్తా, కస్తూరి బాల్రాజు, పరుష శ్రీనివాస్, మసూద్, చెట్ల వెంకటేశ్, యాదగిరిరెడ్డి, ఆలయ అర్చకులు పండిత్ లక్ష్మీనారాయణ, మధుసూదన్, ప్రశాంత్, పవన్, శ్రీనివాస్, శ్రీకాంత్, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్,ఆగస్టు 25 : కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో శివలింగ విగ్రహ ప్రతిష్ఠాపన బుధవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు యాదవరెడ్డి, ఆలయ అర్చకులు లక్ష్మణాచారి, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.