కుత్బుల్లాపూర్, ఆగస్టు 23 : ఆలయాల అభివృద్ధి కోసం నిరంతరం తన సహాయం ఉంటుందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. జీడిమెట్ల డివిజన్ పరిధిలోని అయోధ్యనగర్‌లో రామాలయం పునఃనిర్మాణ పనులకు సోమవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవ చింతనతోనే ప్రశాంతత కలుగుతుందన్నారు. అనంతరం టీఆర్ఎస్ యువ నాయకులు విశాల్‌గౌడ్ హాజరై ఆలయ పునఃనిర్మాణంలో తనవంతు కృషిని అందిస్తానని కాలనీవాసులకు హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు ఎం.యేసు, వినాయక్ నగర్ అధ్యక్షుడు నదీంరాయ్, రాజ్‌కుమార్, ఉమేశ్‌సింగ్, సోమ నర్సయ్య, లింగం, అంజయ్య, జాకీ, రమే శ్, మల్లేశ్, భాస్కర్, సత్యనారాయణ, జ్ఞానేశ్వర్ ఉన్నారు