దుండిగల్, ఆగస్టు 21 : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శవంతంగా నిలుస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు అన్నారు. శనివారం దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన 47 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద మంజూరైన రూ.47 లక్షల 5,452 వేల చెక్కులను వారికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలనలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు యావత్ దేశానికి ఆదర్శవంతంగా నిలుస్తున్నాయన్నారు. నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల పెండ్లి చేయాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఉండేవని, అలాంటి సమయంలో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ప్రవేశపెట్టి.. ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తుందన్నారు. ఇలాంటి సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో చైర్మన్ సుంకరి కృష్ణవేణికృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజ్‌యాదవ్, తాసీల్దార్ భూపాల్, వైస్ చైర్మన్ తుడుం పద్మారావు, డీటీ సుధాకర్, పీఎసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్‌రెడ్డి, మాజీ జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, నర్సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, పీఎసీఎస్ వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, నాయకులు పాల్గొన్నారు.