గాజులరామారం, ఆగస్టు 20 : సంక్షేమ సంఘాలు కాలనీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని లెనిన్‌నగర్ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీ సంక్షేమ సంఘం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి కాలనీలో మెరుగైన వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. సంక్షేమ సంఘం సభ్యులంతా ఐకమత్యంగా ఉంటూ ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకవస్తే పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు తారాసింగ్, కాలనీ వాసులు జి.వి.శ్రీనివాస్, వనం సాంబరాజు, సి.హెచ్.ప్రసాద్, బస్వరాజు పటేల్, బి.వెంకటేశ్, వై.బాల్‌రెడ్డి, ఆదినారాయణ, దామోదర్, తాడెం రాజు, ఎండీ.మహ్మద్, విజయ్, కె.భైరవమూర్తి, శివనాయక్, రవీందర్ నాయక్, పిల్లి ప్రసాద్, తౌర్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.