జీడిమెట్ల, ఆగస్టు 19 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో మెరుగైన వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే నివాసంలో నూతనంగా ఎన్నికైన ఎస్‌ఆర్‌నాయక్‌నగర్ సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కాలనీ అభివృద్ధి కోసం సంక్షేమ సంఘాలు ఐకమత్యంగా ఉంటూ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గుడిమెట్ల సురేశ్‌రెడ్డి, సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు జి.శ్రీనివాస్‌రావు, సి.హెచ్.మహేందర్‌రెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్,ఆగస్టు19: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అన్నారు. గురువారం చింతల్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ప్రాంతానికి చెందిన పలువురు తమ సమస్యలను చెప్పేందుకు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులతో చర్చించి, సమస్యలను సత్వరమే పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుటానని హామీ ఇచ్చారు.