గాజులరామారం, ఆగస్టు 18 : ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే తన ధ్యేయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని కైలాశ్హిల్స్లో కాలనీ వాసులు రాయపురాజు మనోహర్‌రావు, రాజకుమారి దంపతుల సహకారంతో రూ.5 లక్షలతో నూతనంగా నిర్మించిన కాలనీ ముఖ ద్వారాన్ని కార్పొరేటర్ రావుల శేషగిరిరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీ ముఖద్వారం నిర్మాణానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కస్తూరి బాల్‌రాజు, పరుష శ్రీపివాస్యాదవ్, ఆబీద్, సింగారం మల్లేశ్, ఇబ్రహీం, చెట్ల వెంకటేశ్, మురళీ, సంధ్యారెడ్డి, కాలనీ అధ్యక్షుడు అశోక్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి సతీశ్, నాయుడు, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.