గాజులరామారం, ఆగస్టు 18 : మహిళలకు శానిటేషన్ సదుపాయాలు కల్పించేందుకు జీహెచ్ఎంసీ కృషి చేస్తున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. బుధవారం గాజులరామారం డివిజన్ పరిధిలోని ఉషోదయకాలనీ ప్రధాన రహదారిపై జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన షీ టాయిలెట్స్‌ను ఆయనతో పాటు కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత, స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరిరావు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాలలో టాయిలెట్స్లేక మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తున్నదన్నారు. మహిళలకు సరైన శానిటేషన్ వసతులు కల్పించేందుకు జీహెచ్ఎంసీ నూతనంగా షీ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేసిందన్నారు. డ్వాక్రా మహిళల దరఖాస్తుల మేరకు జీహెచ్ఎంసీ వారు అక్కడ కేటాయించిన దుకాణాల ద్వారా వచ్చే ఆదాయంపై ఈ మరుగుదొడ్ల నిర్వాహణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, డిప్యూటీ ప్రాజెక్టు అధికారి హరిప్రియ, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు విజయ్రామిరెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాస్‌యాదవ్, నవాబ్, ఆబిద్, సింగారం మల్లేశ్, మసూద్, ఇబ్రహీం, చెట్ల వెంకటేశ్, సంధ్యారెడ్డి, నిర్వాహకురాలు రాధబాయి పాల్గొన్నారు.