కుత్బుల్లాపూర్,ఆగస్టు14 : ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రజలకు హామీ ఇచ్చారు. శనివారం చింతల్ క్యాంపు కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన ప్రతి ఒక్కరి సమస్యలను స్వీకరించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకొస్తే, నిరంతరం అందుబాటులో ఉంటూ పరిష్కారం కోసం పని చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను అధికారులు వెనువెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.