గాజులారామారం, ఆగస్టు 7: నిరుపేదలకు ఏ ఆపద వచ్చినా ముందుంటానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి.వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని రోడామేస్త్రీనగర్ బీలో నివాసం ఉంటున్న మహమ్మద్ జిలానీ కూరగాయలు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు జిలానీ ఇల్లు శుక్రవారం కూలిపోవడంతో ఇంట్లో ఉన్న అతని కోడలు, మనవరాలికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ శనివారం ఆయన నివాసానికి వెళ్లి రూ.లక్ష ఆర్థికసాయాన్ని అందించి అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిలానీ కుటుంబానికి ప్రభుత్వ పరంగా సహాయం అందేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కమలాకర్, పరుష శ్రీనివాస్‌యాదవ్, ఆబిద్, సింగారం మల్లేశ్, రాజు, ఇబ్రహీం, చెట్ల వెంకటేశ్, ఫర్జానా బేగం, ఎండీ.నిజాముద్దీన్, మోసీన్ తదితరులు పాల్గొన్నారు.