దుండిగల్,గాజులరామారం, ఆగస్టు 7: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రూ.314.44 కోట్ల నిధులతో మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. శనివారం గాజులరామారం పరిధిలోని పరికి చెరువు వద్ద రూ.49.87 కోట్లతో 28 ఎంఎల్డీ సామర్థ్యంతో ఎస్టీపీ నిర్మించేందుకు స్థలం కేటాయింపుపై మేయర్ కొలన్ నీలా గోపాల్‌రెడ్డి, కమిషనర్ గోపి, ఎస్టీపీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా 17వ డివిజన్ పరిధిలోని కౌసల్యకాలనీ, సాయికృష్ణజా హిల్స్‌లో పాదయాత్ర నిర్వహించి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ.. 17వ డివిజన్ పరిధిలోని కాసానీ కౌసల్యకాలనీ, సాయికృష్ణజాహిల్స్ కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వర్షపు నీరు శుభ్రత, శుద్ధీకరణ కేంద్రాల ఏర్పాటు కోసం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రూ.300 కోట్లు ఇస్తామన్న విషయాన్ని గుర్తుచేశారు. అంతకుముందు ఆయా కాలనీల్లో మొక్కలు నాటి, నీరు పోశారు. కార్యక్రమంలో ఎస్టీపీ జీఎం తిప్పన్న, డీజీఎం మురళీ మనోహర్, డీఈ రామ్చందర్రాజు, ఎస్టీపీ మేనేజర్ శ్రీకాంత్ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధన్రాజు, కార్పొరేటర్లు ఆగంపాండు ముదిరాజు, మంత్రి సత్యనారాయణ, విజయలక్ష్మి, నాయకులు సురేశ్‌రెడ్డి, పరుష శ్రీనివాస్‌యాదవ్, వెంకటేశ్ పాల్గొన్నారు