కుత్బుల్లాపూర్జోన్ బృందం,జూలై 4: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటుదాం…భవిష్యత్తరాలకు ఆదర్శంగా నిలుద్దామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తెలిపారు. ఆదివారం నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం, కుత్బుల్లాపూర్ జంటసర్కిళ్లలోని డివిజన్లతో పాటు కొంపల్లి మున్సిపాలిటీ, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించిన పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మొక్కలు నాటారు.
జీడిమెట్ల డివిజన్ పరిధిలోని శ్రీనివాస్‌నగర్ ఫేస్-3లో యువనాయకుడు కేపీ విశాల్‌గౌడ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కాలనీ అధ్యక్షుడు కేవీఎస్ కుమార్, ఉపాధ్యక్షుడు వెంకట్రావ్, సంపత్, ప్రధాన కార్యదర్శి శంకర్రావు, కోశాధికారి సురేందర్, జగన్ పాల్గొన్నారు.
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు, 13వ వార్డులో హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, చైర్మన్ సన్నా శ్రీశైలంయాదవ్, వైస్ చైర్మన్ రత్లావత్ గంగయ్యనాయక్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డా.ఎన్.సత్యనారాయణ, కమిషనర్ రఘు, డీఈఈ విజయలక్ష్మి, ఏఈ ప్రవీణ్, కౌన్సిలర్ బైరి విద్య, మడమశెట్టి సువర్ణ, సన్న రవియాదవ్ తదితరులు పాల్గొన్నారు.
చింతల్ డివిజన్ పరిధి భగత్‌సింగ్‌నగర్ గ్రంథాలయం వద్ద కార్పొరేటర్ రశీదాబేగం పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మల్టీ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం వాలీబాల్ కోర్డును ప్రారంభించారు. చింతల్ టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ఫ్రీ, ఏఈ సంపత్, జలమండలి మేనేజర్ పూజిత, శానిటేషన్ సూపర్వైజర్ దుర్గారావు పాల్గొన్నారు.
సుభాశ్‌నగర్ డివిజన్లోని సూరారం కాలనీ ఓం జెండా వద్ద కార్పొరేటర్ గుడిమెట్ల హేమలత సురేశ్‌రెడ్డి మొక్కలు నాటారు. డీఈ పాపమ్మ, ఏఈ సురేందర్‌నాయక్ పాల్గొన్నారు.
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో గాగిళ్లాపూర్ ప్రధాన రహదారిలోని మొక్కలను అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ పరిశీలించారు. బహదూర్‌పల్లి వార్డులో మున్సిపల్ వైస్‌చైర్మన్ తుడుం పద్మారావు కమిషనర్ భోగీశ్వర్లు మొక్కలు నాటారు. ప్రత్యేకాధికారి సత్యనారాయణ, కౌన్సిలర్లు ఎల్లుగారి సత్యనారాయణ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 7వ డివిజన్ శ్రీనివాస్‌నగర్ కాలనీ, 15వ డివిజన్ రాజీవ్‌గాంధీనగర్, 2వ డివిజన్ ఎన్ఆర్ఐ కాలనీ తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మేయర్ నీలాగోపాల్‌రెడ్డి, కమిషనర్ గోపి, సీనియర్ నాయకుడు కొలన్ గోపాల్‌రెడ్డి పాల్గొని పలు చోట్ల మొక్కలు నాటారు.ఫాగింగ్ మిషన్లను ప్రారంభించారు.