జీడిమెట్ల, నవంబర్ 7: జిమ్నాస్టిక్స్ క్రీడల్లో రాణించడం అభినందనీయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అన్నారు. ఆదివారం సుభాష్‌నగర్ ఫేజ్ 1లో వీజే.జిమ్నాస్టిక్స్ అకాడమీలో నిర్వహించిన ఉమ్మడి రం గారెడ్డి జిల్లా జిమ్నాస్టిక్ ఛాంపియన్ షిప్ క్రీడలకు ఎమ్మె ల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులు జిమ్నాస్టిక్ పోటీల్లో రాణించాలన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు చాంపియన్‌షిప్ ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు, మాజీ కార్పొరేటర్ గుడిమెట్ల సురేశ్‌రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రేమ్‌రాజు, కోశాధికారి మహేశ్వర్, సుభాష్‌నగర్ ఫేజ్ 1 రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.కృష్ణ, సలహాదారులు మండ వ శ్రీనివాస్‌గౌడ్, వెంకటరమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.బాలరాజు, కోశాధికారి చంద్రరావు, విజె.జిమ్నాస్టిక్స్ అకాడమీ నిర్వాహకుడు విజయ్‌పాల్‌రెడ్డి, నాయకులు మల్లారెడ్డి, ఎల్.కె.దాస్, సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
గాజులరామారం, నవంబర్ 7: గాజులరామారం డివిజన్లోని అంబేద్కర్‌నగర్‌లో కొత్త రేషన్ షాపును ఎమ్మెల్యే కెపి.వివేకానంద్, కార్పొరేటర్ రావుల శేషగిరిరావు ఆదివారం ప్రారంభించారు. లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు విజయ్రామిరెడ్డి, నాయకులు రషీద్‌బేగ్, కమలాకర్, పరుష శ్రీనివాస్‌యాదవ్, నవాబ్, సింగారం మల్లేశ్, మసూద్, అజయ్ ప్రసాద్‌గుప్తా, చందు, చెట్ల వెంకటేశ్, మురళి, మహిళా అధ్యక్షురాలు సంధ్యారెడ్డి, వెంకట్, సంతోష్, జహంగీర్, బిలాల్, మోహిన్, రాజాభాయ్, ఇమ్రాన్, జాఫర్, మున్నా, సంగ్రామ్, దాస్, రవి, యూసుఫ్ పాల్గొన్నారు.
దుండిగల్/ కుత్బుల్లాపూర్, నవంబర్7: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని జర్నలిస్టు కాలనీలో సీసీరోడ్డు పనులు పూర్తయిన సందర్భంగా కాలనీ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్‌ను ఆదివారం సన్మానించారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు మారుతిసాగర్, ఎం.లాలయ్య, జగీదశ్వర్గుప్తా, దేవేందర్‌గుప్తా, నాగేంద్రచారి, కేవీవీ.సత్యనారాయణ, కృష్ణ, మారుతికుమార్, మల్లికార్జున్ ఉన్నారు.
జీడిమెట్ల డివిజన్ ప్రసూననగర్‌లో కమ్యూనిటీహాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే రూ.10 లక్షల నిధులు మంజూరు చేయడంతో ఆ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో ఎస్.నాగేశ్వర్రావు, సీహెచ్.శంకర్, రాంచందర్, సాగర్‌రెడ్డి, రాం బ్రహ్మం, రవీందర్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
గాజులరామారం, నవంబర్ 7: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సంఘం అభ్యున్నతికి పాటుపడుతానని ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్లోని భూదేవిహిల్స్కు చెందిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ సంఘం నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యేను ఆయన నివాసంలో ఆదివారం కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో బాబుగౌడ్, సలహాదారులు మల్లేశ్‌గౌడ్, పాపయ్యగౌడ్, గౌరవ అధ్యక్షుడు బాపుగౌడ్, అధ్యక్షుడు అంజన్‌గౌడ్, ఉపాధ్యక్షులు తిరుపతిగౌడ్, శివకుమార్‌గౌడ్, వెంకటస్వామిగౌడ్, కార్యదర్శి రామదాసుగౌడ్, కోశాధికారులు నాగ చంద్రశేఖర్‌గౌడ్, మల్లేశ్‌గౌడ్, ఆర్గనైజర్లు కుమార్‌గౌడ్, రామ్మోహన్‌గౌడ్, సహాయ కార్యదర్శులు నర్సింహులుగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, సుధాకర్‌గౌడ్, సలహదారులు సత్యంగౌడ్, రవిగౌడ్, భాస్కర్‌గౌడ్, నరేందర్‌గౌడ్ పాల్గొన్నారు.