కుత్బుల్లాపూర్, నవంబర్ 2 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో రాబోయే రోజుల్లో ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రణాళిక బద్ధంగా శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కోరారు. మం గళవారం పేట్ బషీరాబాద్ క్యాంపు కార్యాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో త్వరలో చేపట్టనున్న రోడ్ల అభివృద్ధి నిర్మాణ పనుల దిశనిర్దేశాలపై తీసుకోవాల్సిన పలు అంశాలను కూలంకుషంగా చర్చించారు. నియోజకవర్గం పరిధిలోని బాచుపల్లి నుంచి మల్లంపేట్ మీదుగా భౌరంపేట్ వరకు రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారమార్గంపై చర్చించారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని అవసరమైన రోడ్డు వెడల్పు, అభివృద్ధి పనులకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో రూ.138 కోట్ల అంచనాలు ఇప్పటికే పూర్తి అయ్యాయని వివరించారు.
దీంతో పాటుగా కొంపల్లి చౌరస్తా నుంచి దూలపల్లి మీదుగా బహదూర్‌పల్లి వరకు వెళ్లే ప్రధాన రోడ్డు వెడల్పులో భాగంగా రూ.21 కోట్ల నిధుల మంజూరుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులతో పాటు ఇతర అభివృద్ధి నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా హెచ్ఎండీఏ అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని పలు సూచనలు చేశారు. నిధులను సకాలంలో మంజూరు చేయించేలా పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ సిద్ధంగా ఉన్నారని, అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు రావాలని కోరారు. సమావేశంలో హెచ్ఎండీఏ ఎస్ఈ హుస్సేన్, ఈఈ రమేశ్‌తో పాటు సిబ్బంది ఉన్నారు.
సుభాష్‌నగర్ డివిజన్ పరిధిలోని ఎస్వీ కో-ఆపరేటివ్ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపా యాలను పూర్తి చేసిన సందర్భంగా కాలనీవాసులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ను సన్మానించారు. మంగళవారం చింతల్ క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యేను కలిసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాలనీలను అభివృద్ధి పథంలో తీర్చిది ద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేలా తగు చర్యలు తీసుకుంటానని కాలనీవాసులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో కాలనీవాసులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.