గాజులరామారం, అక్టోబర్ 9 : టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యవర్గ సభ్యులు కృషి చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. నూతనంగా ఎన్నికైన జగద్గిరిగుట్ట డివిజన్ టీఆర్ఎస్ కమిటీ సభ్యులు కార్పొరేటర్ కొలుకుల జగన్‌తో కలిసి ఎమ్మెల్యేను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రుద్ర అశోక్, ప్రధాన కార్యదర్శి హజ్రత్‌అలీ, డివిజన్ మహిళా అధ్యక్షురాలు ఇందిరా గౌడ్, ప్రధాన కార్యదర్శి శాంతి కరుణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, యూత్, పలు బస్తీలు, కాలనీల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కాలనీ అభివృద్ధికి సంక్షేమ సంఘాలు పాటుపడాలని ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని అంబేద్కర్‌నగర్‌లో నూతనంగా ఎన్నికైన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శనివారం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కార్పొరేటర్ రావుల శేషగిరిరావుతో కలిసి సన్మానించారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నవాబ్, అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్, వర్కింగ్ ప్రెసిడెంట్ జహంగీర్, ఖాన్, ప్రధాన కార్యదర్శి వెంకట్, ఉపాధ్యక్షులు రాజాబాయ్, ఇమ్రాన్,సంగ్రామ్, ఫరీద్, గోవింద్, గోపాల్‌రావు, సురేశ్, మున్నా, యూసుఫ్, శివాజీ, అంజన్బాయ్ పాల్గొన్నారు.