కుత్బుల్లాపూర్, అక్టోబర్ 3: ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం పేట్‌బషీరాబాద్‌లోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయానికి వివిధ సమస్యలపై నియోజకవర్గ ప్రజలు వచ్చారు. ఎమ్మెల్యేను కలిసి సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించారు. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే వాటిని పరిష్కరించేలా అధికారులు తగుచర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా నిరంతరం కృషి చేస్తామని ప్రజలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.