దుండిగల్, అక్టోబర్ 3: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేట డ్రీమ్వ్యాలీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి నిర్వహించనున్న ‘బతుకమ్మ సంబురాలు-2021’ గోడ పత్రికను ఎమ్మెల్యే ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాలనీ సంక్షేమసంఘం అధ్యక్షుడు దశరథ, వేణునాథ్, ఏకాంబర్రెడ్డి, సుధాకర్, భూషణ్, దుండిగల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ కమిటీ మహిళా విభాగం అధ్యక్షురాలు మనోజ, హిందూ, సుమలత, మనుజ్యోతి పాల్గొన్నారు.