దుండిగల్/కుత్బుల్లాపూర్,సెప్టెంబర్15 : పార్టీ అభివృద్ధికి నమ్మకంతో పని చేసిన ప్రతి కార్యకర్తకు గులాబీజెండా అండగా ఉంటుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీల పరిధిలో బస్తీ కమిటీల ఏర్పాట్లను పరిశీలించి ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గడపగడపకు టీఆర్ఎస్ జెండాను ఎగురవేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. పేదల అభ్యున్నతి కోసం నిరంతరం పాటు పడుతున్న సీఎం కేసీఆర్ లక్ష్యసాధన దిశగా ప్రతి ఒక్క కార్యకర్త పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కష్టపడి పని చేసే వారికి తప్పకుండా తగిన గుర్తింపును అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లిలో 20వ డివిజన్ కార్పొరేటర్ బాలాజీనాయక్ ఆధ్వర్యంలో వార్డు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ ధన్‌రాజ్‌యాదవ్, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గండిమైసమ్మ వద్ద టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యాలయంలో డిపోచంపల్లి గ్రామంలో 6,7,10వ వార్డుల కమిటీలను నియామక సభను నిర్వహించారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై ఎంపిక చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్‌రెడ్డి, దుండిగల్ వైస్ చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, మహేందర్‌యాదవ్, సాయి, రాజశేఖర్‌యాదవ్, మల్లేశ్, యాదగిరి, కె,రాము, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 4వ వార్డులో జరిగిన వార్డు కమిటీ నియామకం చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. ఎమ్మెల్యే వివేకానంద్ కమిటీ ఎన్నికను పరిశీలించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంగయ్యనాయక్, కౌన్సిలర్లు సువర్ణకృష్ణ, డప్పు కిరణ్‌కుమార్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
సుభాశ్‌నగర్ డివిజన్ పరిధిలోని తెలుగుతల్లి నగర్లో బస్తీ కమిటీని మాజీ కార్పొరేటర్ గుడిమెట్ల సురేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా నియమించారు. కమిటీ అధ్యక్షులుగా వినయ్, ఉపాధ్యక్షులుగా నారాయణ, కోశాధికారిగా శివ, సహాయ కార్యదర్శిగా కైసర్‌పాషా, కార్యదర్శిగా బాలరాజ్‌తో పాటు సభ్యులను ఎన్నుకున్నారు.
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15,16,20 డివిజన్లలో పార్టీ నూతన కమిటీలను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధన్‌రాజ్‌యాదవ్, కార్పొరేటర్లు సుజాత, ఆగం పాండు, బాలాజీనాయక్ పాల్గొన్నారు.
131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలో వాణినగర్, పాపయ్యయాదవ్నగర్, సాయిబాబానగర్ బస్తీ కమిటీలను మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీశ్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయా కాలనీల అధ్యక్షులుగా జార్జ్, నర్సింహా, హన్మంత్రావులతో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు సత్తిరెడ్డి, అరుణ, సత్యవతి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు కమిటీ అధ్యక్షునిగా ఎండీ ఆరీఫ్, ఉపాధ్యక్షులుగా చింతయాదవ్లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో చైర్మన్ సన్నా శ్రీశైలంయాదవ్, వైస్ చైర్మన్ గంగయ్యనాయక్, దూలపల్లి పీఏసీఎస్ చైర్మన్ గరిశె నరేందర్‌రాజు, పార్టీ శ్రేణులు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.