దుండిగల్, సెప్టెంబర్ 9 : నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని కాలనీలు/బస్తీలను సమగ్రంగా అభివృద్ధి పర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కుత్బుల్లాపూర్ శాసన సభ్యులు కేపీ వివేకానంద్ అన్నా రు. ఎన్ఎంసీ పరిధిలోని పలు డివిజన్లల్లో రూ.1.33 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డితో కలిసి గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసి.. ఆదర్శంగా నిలుపుతామన్నారు. అందులో భాగంగానే ప్రగతినగర్‌లోని 3వ డివిజన్ పరిధిలో రూ.10లక్షలతో సీసీ రోడ్డు, 6వ డివిజన్లో రూ.15 లక్షలతో పార్కు అభివృద్ధి, 11వ డివిజన్లో రూ.17లక్షలతో భూగర్భడ్రైనేజీ, 12వ డివిజన్లో రూ.11లక్షలతో సీసీ రోడ్డు, 13వ డివిజన్లో రూ.21.33లక్షలతో పాటు 14వ డివిజన్లో రూ.6లక్షలతో భూగర్భ డ్రైనేజీ పనుల కు, 22వ డివిజన్లో రూ.23.20లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, రూ.10లక్షలతో సర్వేపల్లి రాధాకృష్ణ పార్కు అభివృద్ధి పనులు, 23వ డివిజన్లో రూ.9లక్షలతో భూగర్భడ్రైనేజీ పనులు, రూ.11లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు.
నిజాంపేటలోని ప్రతి డివిజన్‌ను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజాంపేట కార్పొరేషన్ అన్ని విధాలా అభివృద్ధిలో ముందుకు వెళుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధికి నిధుల కొరత లేకుండాపోయిందన్నారు. రానున్న రోజుల్లో నిజాంపేటను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ ధన్రాజు, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు కొలన్ గోపాల్‌రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.