కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 8 : సీఎం కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, బురద కుంటలు లేని కాలనీలు తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 131 కుత్బుల్లాపూర్ డివిజన్లో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీశ్తో కలిసి భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పద్మానగర్ ఫేస్-2లో రూ.47.4 లక్షలు, దత్తాత్రేయ నగర్లో రూ.81.4 లక్షలు, సంజీవయ్యనగర్‌లో రూ.37లక్షలు, బాపునగర్‌లో రూ.49.7 లక్షలు, వీకర్సెక్షన్లో రూ.20.1 లక్షలు, బాల్‌రెడ్డి నగర్లో రూ.27.7 లక్షలు, నవోదయ నగర్లో రూ.9.6 లక్షలు, చెరుకుపల్లి కాలనీలో రూ.19.6 లక్షలు, అంబేద్కర్ నగర్లో రూ.19.9 లక్షలు,
మాణిక్యనగర్‌లో రూ.28 లక్షలు, ద్వారకానగర్‌లో రూ.40 లక్షలు, మధుసూదన్‌రెడ్డి నగర్లో రూ.19.8 లక్షలు, ధీనగర్‌లో రూ.38.6 లక్షలు, గణేశ్‌నగర్‌లో రూ.28.6 లక్షలు, కల్పన సొసైటీలో రూ.16 లక్షలు, పద్మానగర్ ఫేస్-1లో రూ.28.5 లక్షలు, ఎన్టీఆర్ నగర్లో రూ.33 లక్షలు, పాపయ్యయాదవ్ నగర్లో రూ.7.7 లక్షలు, రామ్‌రెడ్డినగర్‌లో రూ.53 లక్షలు, సూర్యనగర్‌లో రూ.30 లక్షలు, ద్వారకాపురి నగర్లో రూ.29 లక్షలు, ఇందిరసింగ్ నగర్లో రూ.29.లక్షల నిధులతో భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి ప్రభుత్వాలు నియోజకవర్గంలో చేయని అభివృద్ధి, భవిష్యత్ కనీవినీ ఎరుగని పద్ధతుల్లో ప్రతి కాలనీల్లో అభివృద్ధి కోసం కోట్ల రూపాయాలను వెచ్చించడం జరుగుతుందన్నారు. రాబోయే మరో ఐదారు నెలల వరకు శంకుస్థాపన చేసిన పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజా అవసరాలను గుర్తించి అభివృద్ధి చేసి నిరూపిస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు దూదిమెట్ల సోమేశ్, మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర్రావు, మాజీ కౌన్సిలర్ కిషన్‌రావు, సూర్యప్రభ, పార్టీ సీనియర్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, సత్తిరెడ్డి, ఎండీ నషీర్, రాకేశ్, జగదీష్‌గౌడ్, వెంకటేశ్, ఆగర్మియా, ఉమామహేశ్, ఆయా కాలనీల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, పార్టీ శ్రేణులు, కాలనీవాసులు పాల్గొన్నారు.