దుండిగల్, సెప్టెంబర్6: నియోజకవర్గంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎలాంటి నిధుల కొరత లేదని సీసీరోడ్లు, డ్రైనేజీ పనులను సకాలంలో పూర్తి చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. పేట్‌బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన కుత్బుల్లాపూర్, గాజులరామారం జంటసర్కిళ్ల్లకు చెందిన ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జంట సర్కిళ్ల పరిధిలోని ఎనిమిది డివిజన్లలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ఆయా డివిజన్లలో సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ పనుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.40కోట్లు మంజూరు చేసిందని, అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని అవసరమైతే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి మరిన్ని నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. పలు ప్రాంతాల్లోని వైకుంఠధామాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఈఈ కృష్ణచైతన్య, డీఈలు పాపాయమ్మ, రామచందర్రాజు, శిరీష, ఏఈలు సురేందర్‌నాయక్, మల్లారెడ్డి, సంపత్, ఆశ, కల్యాణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.