చర్లపల్లి, ఆగస్టు 8 : అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఈసీఐఎల్ చౌరస్తాలోని సాయిబాబా ఆలయంలో ఆదివారం ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా వాసవి మిత్ర మండలి ఆధ్వర్యంలో అమవాస్య సందర్భంగా చేపట్టిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి, వాసవి మిత్ర మండలి నాయకులు పెద్ది నాగరాజుగుప్తా, శ్రీనివాస్, గంపా కృష్ణ, రామిణి తిరుమలేశ్, రమేశ్‌గుప్తా, పెద్ది శ్రీనివాస్, వంగునూర్ అశోక్, బెలిదే భగవాన్, టీఆర్ఎస్ నాయకులు కాసం మహిపాల్‌రెడ్డి, సప్పిడి శ్రీనివాస్‌రెడ్డి, డప్పు గిరిబాబు, జాండ్ల ప్రభాకర్‌రెడ్డి, రెడ్డినాయక్, పద్మారెడ్డి, మహ్మద్బాజీబాషా, బాల్‌రాజు పాల్గొన్నారు.