రామంతాపూర్,ఆగస్టు 22 : ఉప్పల్ కారిడార్ పనులను వెంటనే చేపట్టాలని కోరుతూ శుక్రవారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసి సమస్యలు విన్నవించారు. ఉప్పల్ నుండి వరంగల్ జాతీయ రహదారి పై సాగుతున్న కారిడార్ పనులు ఆలస్యమ వుతున్నాయని వెంటన చేపట్టాలని మంత్రి ని కోరారు. ఉప్పల్ నుండి నారపల్లి వరకు జరగుతున్న పనులు చేపట్టి ఏడు సంవత్సరాలు అయిందన్నారు.
వర్షాలకు గుంతలు పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రెండు రకాల పనులు ఏక కాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. మంత్రి స్పందింది ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చామ న్నారు. త్వరలో పూర్తి చేస్తామని చెప్పినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీకార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.