జవహర్‌నగర్, ఆగస్టు 17 : పేదల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. 11వ డివిజన్‌కు చెందిన శేఖర్‌కు సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.60వేల చెక్కును మంగళవారం మంత్రి మల్లారెడ్డి కార్పొరేటర్ గుండ్రాతి లక్ష్మీకృష్ణగౌడ్ సమక్షంలో బాధితుడికి అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయనిధి వరంలా మారుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జవహర్‌నగర్ యూత్ అధ్యక్షుడు మేకల భార్గవ్‌రామ్, టీఆర్ఎస్ స్పోక్‌పర్సన్ జిల్లా శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు సుధాకర్‌చారి, 7వ డివిజన్ అధ్యక్షుడు మెట్టు వెంకన్న, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.