వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్‌సిరీస్ రెండు సీజన్స్‌లో ప్రేక్షకుల్ని అలరించింది. తాజాగా ఈ సిరీస్ మూడోభాగం ‘కానిస్టేబుల్ కనకం చాప్టర్ 3 కాల్ ఘాట్’ సినిమాగా థియేటర్స్‌లో విడుదలకానుంది. అలాగే రెండు సీజన్స్‌ను కలిపి థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నారు. ‘కాల్ ఘాట్ చాప్టర్-3’ గ్లింప్స్‌ని ఇటీవల ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు.
ఈ సందర్భంగా వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ..ఈ సిరీస్ తనకెంతో సంతృప్తినిచ్చిందని, చాప్టర్-3కోసం కిక్ బాక్సింగ్ నేర్చుకున్నానని, అనూహ్య మలుపులతో మూడోభాగం థ్రిల్‌ని పంచుతుందని చెప్పింది. కాల్‌ఘాట్ చాప్టర్-3 విభిన్నమైన కథాంశమని దర్శకుడు ప్రశాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.