మేడ్చల్, నవంబర్ 5: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలను సీఎం సహాయనిధి ఆదుకుంటున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని గౌడవెల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ రెడ్డికి వైద్య సహాయ నిమిత్తం మంజూరైన రూ. 1 లక్ష సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంత్రి నివాసంలో లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థికంగా ఆదుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి, మేడ్చల్ పీఏసీఎస్ చైర్మన్ రణదీప్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, రవీందర్‌గౌడ్, సంజీవగౌడ్, సంతోష్ పాల్గొన్నారు.
పీర్జాదిగూడ : సీఎంఆర్ఎఫ్ పేదలకు మరమని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి అన్నారు. నగరపాలక సంస్థకు చెందిన ఏవీఎస్. సుబ్రహ్మణ్యశాస్త్రీ వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా చెక్కు మంజూరైంది. ఈ చెక్కును మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్, బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శేషగిరిరావు బాధితుడికి అందజేశారు.
మేడ్చల్ రూరల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన ప్రియాంక, మల్లారెడ్డి వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా.. చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను చైర్పర్సన్ లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి మున్సిపాలిటీ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. కౌన్సిలర్లు హేమంత్ రెడ్డి, జైపాల్ రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు సంజీవ గౌడ్, నాయకులు జనార్దన్ రెడ్డి, రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.