డల్లాస్, టెక్సాస్‌లో శక్తివంతమైన, ప్రభావవంతమైన తెలుగు సంస్థగా అక్కడి తెలుగు ప్రజల మన్ననలు పొందుతున్న ‘డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి’ (TPAD) అధ్యక్షురాలిగా మరోసారి మహిళనే ఎన్నుకున్నారు. 2026 సంవత్సరానికి ఏర్పడ్డ నూతన కార్యవర్గ బృందం బాధ్యతలు స్వీకరించింది.
టీపాడ్ బలమైన సంస్థాగత నిర్మాణం ద్వారా అనేక మందిని నాయకులుగా తీర్చిదిద్దడంతో పాటు ,సమాజ సేవ, సంస్కృతి పరిరక్షణకు అహర్నిశలు కృషి చేస్తోంది. టీప్యాడ్, ఫ్రిస్కో, టెక్సాస్‌లోని ఎలిగెన్స్ బాల్రూమ్లో స్థానిక కమ్యూనిటీ నాయకులు, మద్దతుదారుల సమక్షంలో తన 13 వ ఎగ్జిక్యూటివ్ టీమ్ తో ప్రమాణస్వీకారం చేయించింది.
ఈ సందర్భంగా టీప్యాడ్ అధ్యక్షురాలిగా లక్ష్మి పోరెడ్డి ( Laxmi Poreddy ) బాధ్యతలు స్వీకరించారు. మహిళలే అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. ఫౌండేషన్ కమిటీ సభ్యుడు రావు కల్వాల, రఘువీర్ బండారు, అజయ్ రెడ్డి లు ప్రమాణ స్వీకారం చేయించారు.
కొత్త కమిటీ సభ్యులు
లక్ష్మి పోరెడ్డి (అధ్యక్షురాలు), శ్రీనివాస్ అన్నమనేని (ఉపాధ్యక్షుడు), గాయత్రి గిరి (కార్యదర్శి), శివ కొడిత్యాల (సహ కార్యదర్శి), ఆదిత్య రెడ్డి (ఖజాంచీ), దీపిక దీపికా రెడ్డి (సహ ఖజాంచీ)లు ఎన్నికయ్యారు. నూతన ఈసీ సభ్యులుగా బాల గణపవరపు, మాధవి ఓంకార్, శ్రవణ్ కుమార్ నిడిగంటి, హరిక పల్వాయి, సాధన రెడ్డి, ధాత్రి బల్లమూడి, బద్రి బియ్యపు, తిలక్ కుమార్ వన్నంపుల, జనకిరామ్ మండాది ప్రమాణం చేశారు.
అదేవిధంగా నూతనంగా నియమితులైన బోర్డ్ సభ్యులు రవికాంత్ మామిడి, అశోక్ పొద్దుటూరి, రోజా అడెపు, మాధవి సుంకిరెడ్డి, రామ్ అన్నాడి, అశోక్ కొండాల, పాండురంగ రెడ్డి పల్వాయి, బుచ్చి రెడ్డి గోలితో ప్రమాణ స్వీకారం చేయించారు. బీవోటి చైర్మన్‌గా ( BOT ) రవికాంత్ మామిడి , కో ఆర్డినేటర్‌గా లింగా రెడ్డి ఆల్వా , వైస్ చైర్‌గా రోజా అడెపు ప్రమాణ స్వీకారం చేశారు. రానున్న రోజుల్లో రక్తదాన శిబిరాలు, ఆహార పంపిణీ , తెలంగాణ సాంస్కృతిక వేడుకల నిర్వహణ, బతుకమ్మ, దసరా సంబరాలను ఘనంగా నిర్వహిస్తామని నూతన కార్యవర్గం ప్రకటించింది .