IND vs NZ : రాయ్‌పూర్‌లో దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ ఓపెనర్లకు భారత బౌలర్లు చెక్ పెట్టారు. బౌండరీలతో రెచ్చిపోతున్న డెవాన్ కాన్వే(19)ను హర్షిత్ రానా బోల్తా కొట్టించాడు. కాసేపటికే టిమ్ సీఫర్ట్(24)ను వరుణ్ చక్రవర్తి పెవిలియన్ పంపాడు. ఇషాన్ కిషన్ వెనక్కి పరుగెడుతూ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. దాంతో.. ఓపెనర్లు డగౌట్ చేరారు. క్రీజులోకి వచ్చిన రచిన్ రవీంద్ర(35) సిక్సర్లతో చెలరేగుతున్నాడు. దాంతో, కివీస్ 9 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది.
తొలి టీ20లో కంగుతిన్న న్యూజిలాండ్‌కు ఓపెనర్లు శుభారంభమిచ్చారు. అర్ష్‌దీప్ సింగ్ ఓవర్లో పరుగులతో తన దూకుడు చూపించాడు. ఆ తర్వాత హర్షిత్ ఓవర్లోనూ హ్యాట్రిక్ ఫోర్లతో చెలరేగాడు సీఫర్ట్. వీరిద్దరి జోరుతో ఓవర్‌కు పది చొప్పున రన్స్ రాగా నాలుగో ఓవర్లోనే స్కోర్ 40 దాటింది. ప్రమాదకరంగా మారిన ఈ ద్వయాన్ని రానా విడదీశాడు.
Harshit Rana 🤝 Varun Chakaravarthy 🔥
🎥 Both strike in their first over as #TeamIndia get the wickets of both #NZ openers 👏
Updates ▶️ https://t.co/8G8p1tq1RC#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/eOFfUuFkar
— BCCI (@BCCI) January 23, 2026
కాసేపటికే వరుణ్ ఓవర్లో భారీ షాట్ ఆడాలనుకున్న సీఫర్ట్ .. చేతికి చిక్కాడు. కానీ, రచిన్ రవీంద్ర(35), గ్లెన్ ఫిలిఫ్స్ (19) ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడి 25 బంతుల్లోనే 50 రన్స్ జోడించారు. 9వ ఓవర్లో 6, 4, 4 కొట్టిన ఫిలిప్స్‌ను గూగ్లీతో కుల్దీప్ బోల్తా కొట్టించాడు. దాంతో.. 9 ఓవర్లకు బ్లాక్‌క్యాప్స్ 3 వికెట్ల నష్టానికి 99 రన్స్ చేసింది.