బోడుప్పల్, నవంబర్3: అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో బుధవారం మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. మేయర్ సామల బుచ్చిరెడ్డితో కలిసి రూ.2.28కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభించారు. చెంగిచర్ల ఇందిరానగర్ కాలనీలో రూ.50లక్షలు, ఎస్బీఆర్ కాలనీలో రూ.50లక్షలు, దేవేందర్‌నగర్ కాలనీలో రూ.12.60 లక్షలు, టెలిఫోన్ కాలనీలో రూ.8 లక్షలు, ఈస్ట్ హనుమాన్నగర్కాలనీలో రూ. 6.50 లక్షలు, న్యూహేమానగర్ కాలనీలో రూ.62 లక్షలు, తిరుమల మెడోస్ కాలనీలో 38 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను మంత్రి ప్రారంభించారు. చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు.
60 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ఆరేండ్లలో చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో ఆభివృద్ధి పనుల ప్రారంభోత్సవ అనంతరం మీడియాతో మాట్లాడారు. స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ సాధన దిశగా వడివడిగా అడుగులేస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తాగు, సాగునీటికి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఎన్నో సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, టీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, స్థానిక నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
కీసర, నవంబర్ 3 : సీఎం కేసీఆర్ ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులాగా అండగా ఉండి ఆదుకుంటున్నాడని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసర మండల పరిషత్ కార్యాలయం వద్ద బుధవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని తెలంగాణ ఆడపడుచుల కోసం అమలు చేసిన కల్యాణలక్ష్మి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సర్పంచ్, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రవికుమార్, తహసీల్దార్ గౌరివత్సల, ఎంపీడీవో పద్మావతి, ఎంపీపీ ఇందిరలక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ జలాల్పురం సుధాకర్‌రెడ్డి, సర్పంచ్ నాయకపు మాధురి, ఆకిటి మహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జలాల్పురం సుధాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సింగారం నారాయణ, పీఏసీఎస్ చైర్మన్ రామిడి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శామీర్‌పేట, నవంబర్ 3 : ఆద్రాస్‌పల్లి గ్రామంలో ముదిరాజ్ భవన్ నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని సర్పంచ్ లలితానర్సింలు కోరారు. ముదిరాజ్ సంఘం సభ్యులు మంత్రిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. రూ.10 లక్షలు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్ : అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందజేస్తామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీ కార్యాలయాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కును మంత్రి అందజేశారు. నాగారం, రాంపల్లి, దమ్మాయిగూడ, అహ్మద్‌గూడ, కుందన్‌పల్లి ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు చెక్కులను అందుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు చంద్రారెడ్డి, వసుపతి ప్రణీత, కమిషనర్లు ఎ.వాణిరెడ్డి, స్వామి, వైస్ చైర్మన్లు మల్లేశ్, నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీధర్, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
జవహర్‌నగర్ : దేశమంతా సీఎం కేసీఆర్ నాయకత్వం కోరుకుంటుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కాప్రా తహసీల్దార్ అనిత అధ్యక్షతన 34 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌గుప్తా, కమిషనర్ జ్యోతిరెడ్డిల సమక్షంలో అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జిట్టా శ్రీవాణి, నాగరాణి వెంకటేశ్‌గౌడ్, ఏకే మురుగేశ్, గొడుగు వేణు, సతీశ్‌కుమార్, మెట్టు ఆశాకుమారి, లావణ్య, శారద, పల్లపు రవి, సంగీత, గుండ్రాతి లక్ష్మికృష్ణగౌడ్, నవీన్, శ్రీకాంత్, రాంచదందర్, కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొండల్, జనరల్ సెక్రటరీ మహేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సింగన్న బాల్‌రాజ్, జిల్లా నాయకులు అయ్యప్ప, రాజశేఖర్ పాల్గొన్నారు.
మేడ్చల్ రూరల్, నవంబరు 3 : అభివృద్ధిలో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ నియోజకవర్గంలోనే నెంబరు వన్ స్థానంలో ఉందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు అర్కెలగూడలో రూ.30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సింగిల్ ఆర్మ్ లైటింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు రూ.2 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ప్రజలు కోరినట్టు శ్మశాన వాటిక ఏర్పాటు, దేవరయాంజాల్ రోడ్డు బాగు చేయ డం, మిషన్ భగీరథ నీళ్ల సౌకర్యం కల్పిస్తే సమస్యలనేవి ఉండవని తెలిపారు. ఇందుకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కార్యక్రమం లో చైర్పర్సన్ లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ లావణ్య, కౌన్సిలర్లు శ్రీలత, మల్లికార్జున్, రాజకుమారి, రజిత, జైపాల్ రెడ్డి, హేమంత్‌రెడ్డి, వీణ, పెంటయ్య పాల్గొన్నారు.