Indian Students | ఇరాన్లో చిక్కుకున్న భారత విద్యార్దులు.. రేపటి నుంచి తరలించనున్న ప్రభుత్వం..!
Indian Students : పశ్చిమాసియా దేశం ఇరాన్లో ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు సిద్ధమవుతోంది.
Indian Students : పశ్చిమాసియా దేశం ఇరాన్(Iran)లో ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు సిద్ధమవుతోంది. రేపు(శుక్రవార) నుంచి అక్కడే ఉండిపోయిన భారత విద్యార్థులను స్వదేశం తీసుకురానుంది. ఇప్పటికే టెహ్రాన్‌లోని భారత కార్యాలయం అక్కడ వివిధ ప్రాంతాల్లోని ఇండియన్ స్టూడెంట్స్ గురించి ఆరా తీస్తోంది.
రోజురోజుకు ఇరాన్లో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. దాంతో. ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఫోన్ సేవలు కూడా దాదాపు స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో భారత విద్యార్థులు అక్కడే ఉండడం శ్రేయస్కరం కాదని భావించిన ప్రభుత్వం వారిని స్వదేశం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు టెహ్రాన్‌లోని భారత దౌత్య కార్యాలయం అక్కడి భారత విద్యార్థులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తోంది.
In view of the evolving situation in Iran, MEA is making preparations to facilitate the return of Indian nationals who wish to travel back to India: Sources
— ANI (@ANI) January 15, 2026
స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నందున స్వదేశం వెళ్లాలనుకునేవారిని తరలించేందుకు చర్యలు చేపట్టనుంది. రేపటి నుంచి బ్యాచ్‌ల వారీగా ఇండియాకు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వంతో కలిసి ఇండియన్ ఎంబసీ సమన్వయతో పని చేయనుంది. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను భారత విదేశాంగ శాఖ త్వరలోనే వెల్లడించనుంది.
3,428 మంది మృతి
గతేడాది ఇరాన్ కరెన్సీ ‘రియాల్’ (Rial) ధర అనూహ్యంగా పడిపోవడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ పలువురు ఆందోళనలకు దిగారు. చూస్తుండగానే ఈ నిరసనలు దేశంలోని 31 రాష్ట్రాలకు విస్తరించాయి. ఆందోళనకారులను అణచివేసేందుకు సైన్యం కాల్పులు జరపగా ఇప్పటికే 3,428 మంది మరణించారు. దాంతో.. ఆ దేశంలో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్దుల భద్రతపై ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే అక్కడ చిక్కుకొనిపోయిన వారిన స్వదేశం తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
REGIME AT RISK: Hugh Hewitt details President Trump’s push to return freedom to the Persian people, as tensions escalate in Iran and its dictator faces serious warnings from the president like Nicolás Maduro did before the U.S. military captured him.
“A repressed people cannot… pic.twitter.com/FNmhsNi4q2
— Fox News (@FoxNews) January 13, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

