మేడ్చల్, నవంబర్ 2: పేద ప్రజలకు మెరుగైన వైద్యం చేయించుకునేందుకు సీఎం సహాయనిధి వరం లాగా తోడ్పడుతున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన లక్ష్మి వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా.. రూ.27,500 చెక్కు మంజూరైంది. ఈ చెక్కును మంత్రి తన నివాసంలో లబ్ధిదారురాలికి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా క్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని , అన్ని వర్గాల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులున్నా పేదలకు ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్ ఆపలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రవీందర్, ఈశ్వరయ్య, రవికుమార్ , రమాకాంత్ పాల్గొన్నారు.