ఘట్కేసర్ రూరల్, అక్టోబర్ 31: గ్రామాల అభివృద్ధిలో దాతలు భాగస్వాములు కావాలని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి కాచవానిసింగారం పంచాయతీ దివ్యానగర్లో నల్ల మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ నల్ల మల్లారెడ్డి తండ్రి నల్ల సాయిరెడ్డి స్మారకార్థం రూ. 2 కోట్ల 60లక్షల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డితో కలిసి ఆదివారం ప్రారంభించారు. దివ్యానగర్ ప్లాట్లు, ఇంటి యజమానుల సంక్షేమ సంఘం ఆధ్వర్యం లో జరిగిన సామావేశంలో మంత్రి మాట్లాడుతు రాష్ట్రం లో ఎక్కడా లేని విధంగా నల్ల మల్లారెడ్డి ముందుకు వచ్చి దివ్యానగర్ కాలనీని అభివృద్ధి చేసి తన సేవా తత్వాన్ని చాటుకున్నాడని చెప్పారు. కాలనీలో కమ్యునిటీ హాలు, నాలుగు లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్, ఓపెన్ జిమ్, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, పార్కును తన సొంత డబ్బులతో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిచాడని చెప్పారు. కాచవానిసింగారం గ్రామాన్ని దత్తత తీసుకుని మరింత అభివృద్ధికి సహకరించాలని నల్ల మల్లారెడ్డిని కోరారు. ప్రభుత్వ పరంగా తానుకూడా సహకారం అందిస్తానని వెల్లడించారు.
కాచవానిసింగారం పంచాయతీ పరిధిలోని సుప్రభాత్ టౌన్ షిప్‌లోని పార్కు స్థలంలో ఆలయ నిర్మాణం, పాటు పార్కు అభివృద్ధి, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు మంత్రి మల్లారెడ్డి భూమి పూజ చేశారు. సుప్రభాత్ టౌన్షిప్ అభివృద్ధితో పాటు ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం నిరంతరం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, డీపీఓరమణ మూర్తి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మం డల సర్పంచ్ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, నల్ల మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ నల్ల మల్లారెడ్డి, ఎన్ఎన్ఆర్జీ గ్రూప్ విద్యాసంస్థల చైర్మన్ నల్ల నర్సింహారెడ్డి, స్థానిక సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ గీత, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు కుమార్ పంచాయతీ సభ్యులు, మండల టీఆర్‌ఎస్‌నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.