మేడ్చల్/శామీర్‌పేట, అక్టోబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో గొప్ప పథకాలు చేపట్టి, దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎన్ని ఉన్నా, టీఆర్ఎస్కు సరిరావన్నారు. బుధవారం శామీర్‌పేట మండలంలోని అలియాబాద్ చౌరస్తాలో టీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఇన్చార్జి చామకూర మహేందర్‌రెడ్డి ఆధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 14 ఏండ్ల పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ రాష్ట్రంలోనే కాదు దేశంలో తిరుగులేని రాజకీయ పార్టీగా టీఆర్ఎస్కు గుర్తింపు తీసుకొచ్చారన్నారు.
ఏడేండ్ల కాలంగా కష్టపడి దేశంలోనే ఎక్కడాలేని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. రాష్ట్రంలోని 12,700 పంచాయతీల్లో డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, హరితహారం నర్సరీలు, ధాన్యం కొనుగోలు తదితర కార్యక్రమాలు చేపట్టారన్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు, ఇంటింటికీ మిషన్ భగీరథ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారన్నారు. దేశానికే ఆదర్శంగా దళితబంధు పథకాన్ని తీసుకొచ్చానన్నారు. దళితబంధు ద్వారా దళితుల కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున లబ్ధి చేకూరేలా పథకాన్ని ప్రవేశపెడుతున్నారన్నారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని 4 నియోజకవర్గాలో చేపట్టారన్నారు.
పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు వరంగల్‌లో టీఆర్ఎస్ మహా గర్జన సభకు మేడ్చల్ నియోజకవర్గం నుంచి కార్యకర్తలు భారీగా తరలివెళ్లాలని మంత్రి పిలుపు నిచ్చారు. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గానికి లేనట్టుగా మేడ్చల్‌కు 271 బస్సులు కేటాయించారన్నారు. మంత్రి కేటీఆర్ మనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఊరూరా కార్యకర్తలు తరలివచ్చేలా చూడాలన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో కలిపి 440 మంది ప్రజాప్రతినిధులు ఉన్న నియోజకవర్గం మేడ్చల్ అన్నారు. పార్టీ అధినేత ఇచ్చిన టార్గెట్‌కు తక్కువ కాకుండా నియోజకవర్గం నుంచి 300 బస్సులతో మహా గర్జనకు భారీగా తరలివెళ్లేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నో అవహేళనల మధ్య ఒకే ఒక్కడుగా ఉద్యమాన్ని ప్రారంభించి, యావత్ తెలంగాణను ఏకతాటిపైకి తెచ్చి, రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ తెచ్చిపెట్టారన్నారు. ఏడేండ్ల కాలంలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. అనంతరం జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ ఒక వ్యక్తితో మొదలైన టీఆర్ఎస్ పార్టీ నేడు 60 లక్షల కార్యకర్తలతో ఎదిగిందన్నారు. రాష్ట్రంలో 30 మంది జడ్పీ చైర్మన్లు గల పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు.
కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ.జహంగీర్, జిల్లా రైతుబంధు కో ఆర్డినేటర్ నందారెడ్డి, మల్కాజిరి ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశం, మేయర్లు జక్క వెంకట్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, మేకల కావ్య, మున్సిపల్ చైర్మన్లు దీపికా నర్సింహరెడ్డి, ప్రణీత, చంద్రారెడ్డి, పావణి, జడ్పీటీసీలు శైలజ, అనితలాలయ్య, కో ఆప్షన్ సభ్యుడు జహీరోద్దిన్, ఎంపీపీలు ఎల్లూభాయి బాబు, హారిక మురళిగౌడ్, పద్మాజగన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు దయానంద్‌యాదవ్, సుదర్శన్, మల్లేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
పీర్జాదిగూడ, అక్టోబర్ 27: మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పాలక వర్గం, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శివకుమార్‌గౌడ్, పార్టీ అధ్యక్షుడు దయాకర్‌రెడ్డి, కార్పొరేటర్లు అనంత్‌రెడ్డి, భీంరెడ్డి నవీన్‌రెడ్డి, యుగేందర్‌రెడ్డి, సుభాష్, హరి శంకర్‌రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు షేక్ ఇర్ఫాన్, రాందాస్‌గౌడ్, జగదీశ్వర్‌రెడ్డి, నాయకులు అంజిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రవీందర్, సతీశ్‌గౌడ్, దేవేందర్‌గౌడ్, బుచ్చియాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్, అక్టోబర్ 27: నియోజకవర్గ టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి ఘట్కేసర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. శామీర్‌పేట్ మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద నిర్వహించిన సమావేశంలో ఘట్కేసర్ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశ్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగులపల్లి రమేశ్, నాయకులు సిద్దగోని నర్సింహ, నాగార్జున, నక్క నర్సింహ పాల్గొన్నారు.